in

police arrested actor shaam!

ర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం సినిమా సూపర్ హిట్ అయింది. బాక్సాఫిస్ దగ్గర వసూళ్ల విషయం లో కూడా రికార్డు సాధించింది. అయితే ఆ సినిమాలో బన్నీ అన్నగా గా నటించిన నటుడు శ్యామ్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే రేసుగుర్రం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ నటుడిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేసారు. అక్కడ కోడంబాక్కంలో శ్యామ్ పోకర్ క్లబ్ నడుపుతున్నట్లు అలాగే గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక ఇప్పటివరకు తెలుగులో శ్యామ్ కిక్, ఊసరవెల్లి , కత్తి, రేసుగుర్రం వంటి  సినిమాలో నటించాడు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

rana about his marriage!

ileana about nepotism in tollywood!