in

Rakul Preet singh joins AL Vijay-Vishwak Sen’s film!

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజ‌య్.. విశ్వ‌క్సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ ప్ర‌ముఖ ఓటీటీ కోసం ఆంథాల‌జీ ఫిలిం ఒక‌టి తెర‌కెక్కుతోంది. అక్టోబ‌ర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెర‌కెక్కుతోంది. ఒక‌ హాలోవీన్ నైట్ జ‌రిగే అనూహ్య ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ ఎంపిక కావ‌డం విశేషం. త‌మ‌న్నా, కాజ‌ల్, శ్రుతి హాస‌న్, స‌మంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే డిజిట‌ల్ డెబ్యూ చేసేయ‌గా.. ర‌కుల్ కొంచెం లేటుగా బ‌రిలోకి దిగుతోంది. విశ్వ‌క్సేన్ లాంటి చిన్న హీరోతో క‌లిసి న‌టించ‌డానికి ఆమె అంగీక‌రించ‌డం విశేష‌మే.

ఇందులో నివేథా పెతురాజ్, మాంజిమా మోహ‌న్, మేఘా ఆకాష్‌, విద్యుల్లేఖ‌, రెబెక్కా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇది ప్ర‌ధానంగా మ‌హిళ‌ల చుట్టూ తిరిగే క‌థ అని తెలుస్తోంది. ఇందులో విశ్వ‌క్సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ప్ర‌ధానంగా తెలుగులో తెర‌కెక్కే ఈ చిత్రాన్ని త‌మిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయ‌బోతున్నారు. దీనికి థియేట్రిక‌ల్ రిలీజ్ ఉండ‌దు. ఎ.ఎల్.విజ‌య్ త‌లైవి లాంటి భారీ చిత్రం త‌ర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని స‌మాచారం.

Hamsa Nandini Latest Pics From Her vacation!

nani natanaku fidaa aina Australian cricket journalist!