in

malayali Merin Philip earns 6 times more remuneration for telugu film!

తెలుగు సినీ నిర్మాతలు ఇతర భాషా నటీనటులకు ఇచ్చే ప్రాధాన్యం, పారితోషికాల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మన దగ్గర హీరోయిన్ల కొరతతో పాటు పాత్రలకు వారు సరిపోరనే భావనతో, దర్శకులు అధిక రెమ్యూనరేషన్ ఇచ్చైనా సరే ఇతర భాషల హీరోయిన్లకే మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో మలయాళంలో చిన్న తరహా నటి అయిన మెరిన్ ఫిలిప్ ‘అనుమాన పక్షి’ చిత్రం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం ఆమె తన మాతృభాషలో అందుకునే రెమ్యునరేషన్ కంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

ఇప్పటికే మామిత బైజు, అనస్వర రాజన్ వంటి మలయాళ భామలకు తెలుగు నిర్మాతలు భారీ పారితోషికాలు ఇస్తున్నారనే టాక్ ఉండగా, దీనిపై అక్కడ కూడా చర్చలు నడుస్తున్నాయి. అయితే మన సినిమాల బడ్జెట్, వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్లే ఆ స్థాయి రెమ్యునరేషన్ ఇస్తున్నామని టాలీవుడ్ నిర్మాతలు సమర్థించుకుంటున్నారు. రాగ్ మయూర్ హీరోగా, ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అనుమాన పక్షి’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది..!!

mrunal thakur’s 4 years long-delayed film to release finally!