in

PURI’S MARRIAGE SECRETS!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి సమయంలో జరిగిన కొన్ని ఆసక్తిగల విషయాల గురించి చెప్పారు.. తన పెళ్లి విషయంలో అయితే తనకు చాలా కష్టాలు ఎదురయ్యాయని.. యాంకర్ ఝాన్సీతో పాటు మరికొందరికి తను జీవితాంతం రుణపడిపోయానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. తాను ప్రేమించిన లావణ్యను భార్య చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు పూరీ. నిన్నే పెళ్లాడతా సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.

అదే సమయంలో లావణ్యతో ప్రేమలో పడ్డానని చెప్పాడు పూరీ. ఇక తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈ దర్శకుడు. దీనికి ఇండస్ట్రీలోని కొందరు తనకు సాయం చేసారని చెప్పాడు ఈయన. ముఖ్యంగా యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. నటి హేమ పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. స్నేహితులు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారని చెప్పాడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా సాయంత్రం మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ. ఇదంతా ఇప్పుడు వినడానికి చాలా విచిత్రంగా అనిపించినా కూడా తనకు మాత్రం ఎప్పుడూ మరిచిపోలేని జ్ఞాపకాలు అని చెప్పాడు పూరీ జగన్నాథ్.

HOW VENKATESH MISSED AISHWARYA RAI!

jakkana shocking comments on ntr!