in

jakkana shocking comments on ntr!

న్టీఆర్, రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో హైట్రిక్ ని అందుకుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

స్టూడెంట్ నెం1 సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ వయసు 19 సంవత్సరాలు.ఇంకా మీసాలు కూడా రాలేదు. లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైల్ బాగుండేది కాదు. కనీసం పర్సనల్ గ్రూమింగ్ కూడా అతినికి తెలియదు. సో.. నా తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంటి అని చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా తారక్ చెబుతున్న డైలాగ్స్, యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. ఎన్టీఆర్ లో ఏదో ప్రత్యేకత ఉందని, ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

PURI’S MARRIAGE SECRETS!

7 REASONS WHY RANGASTHALAM IS SUKUMAR’S BEST WORK!