in

Taapsee Pannu talks about her 13-year relationship with Mathias Boe!

Keerthy Suresh’s Dorothy

రీసెంట్‌గా ‘గాంధారి’ మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్నారు తాప్సీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. 13 ఏళ్లుగా తాను తన భర్త మథియాస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫస్ట్ ఇయర్‌లోనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో తో డేటింగ్ మొదలైందని చెప్పారు తాప్సీ. ‘నా లైఫ్‌లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే. దేవుడు మనకు ఫ్యామిలీని ఇస్తాడు. నాకు వృత్తి కూడా అనుకోకుండానే వచ్చింది..

కానీ, మథియాస్‌ను సెలక్ట్ చేసుకోవడం మాత్రం పూర్తిగా నా ఛాయిస్. అందుకే నేను గర్వపడుతున్నా. మేం 13 ఏళ్లుగా కలిసున్నాం. మా బంధంలో ఎంతో భద్రత ఉంది. ప్రేమ కంటే ముందు మా మధ్య ఒకరిపై ఒకరికి విపరీతమైన గౌరవం ఉంటుంది. ఓ బంధానికి పునాదికి గౌరవంగా లేకపోతే అది ఎక్కువ కాలం నిలబడదు.’ అని ఆమె స్పష్టం చేశారు. మథియాస్ డెన్మార్క్ దేశానికి చెందిన మాజీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్. తాప్సీ, మథియాస్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2023 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2024లో సాంప్రదాయబద్దంగా ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక చేసుకున్నారు..!!

Chiranjeevi is set to make his digital debut with netflix!

anjali gives humorous explanation about late marriage!