ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఆమె చేసిన ‘భామాకలాపం 2’ ఈ నెల 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె సందడి చేస్తోంది. “వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఎదురుపడినా, నా మనసులోని మాటను చెబుతూ ఉండేదానిని. అలాంటి నా ముచ్చట ‘నారప్ప’ సినిమాతో తీరిపోయింది.
వెంకటేశ్ గారు చాలా పెద్ద స్టార్, అయినా ఆయన సెట్లో చాలా సింపుల్ గా ఉండేవారు. అందరితోనూ సరదాగా మాట్లాడేవారు. ఇంతవరకూ నేను చాలా పాత్రలను పోషించాను. అయితే నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రను చేయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ఇక పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక కూడా బలంగా ఉంది. అలాంటి ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను” అని అన్నారు..!!