తమిళ చిత్రసీమలో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి సినిమా అంటే అభిమానులకు కన్నుల పండుగనే చెప్పాలి. అయితే అతడి సినిమాలో నటించేందుకు హీరోయిన్లు సైతం పోటీపడుతుంటారు. అతడితో ఒక్క సినిమా చేసినా చాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్దె కూడా ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ 65వ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు మొదటగా కన్నడ బ్యూటీ రష్మికను సంప్రదించారు. కానీ దర్శకుడు అడిగిన తేదీలను రష్మిక సర్దుబాటు చేయలేకపోయారంట. దాంతో ఈ సినిమాకు పూజా హెగ్దె పేరు చర్చల్లోకి రావడంతో చిత్ర యూనిట్ పూజాను సంప్రదించారంట. ఇటువంటి అవకాశం కోసం చూస్తున్న పూజా వెంటనే సినిమాకు ఓకే చెప్పారని, ఆ సినిమా కోసం ఓ తెలుగు సినిమాను త్యజించారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.