in

actress Saloni To Romance Sunil Once Again!

ర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి  సునీల్ తో  తెరకెక్కించిన చిత్రం మర్యాద రామన్న. ఈ చిత్రంలో సునీల్ సరసన సలోని నటించింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా సునీల్ కి మంచి విజయాన్ని అందించింది. అయితే.. ఆతర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇటీవల రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మర్యాద కృష్ణయ్య అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

ఇటీవలే టైటిల్ ని రివీల్ చేయడంతో ఈసారి సునీల్ ఏం చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీలో సునీల్ సరసన సలోని కథానాయిక. మర్యాద రామన్న రిలీజైన పదేళ్లకు తిరిగి అదే జోడీ రిపీటవుతోంది. సునీల్, సలోని ఇద్దరూ సరైన సక్సస్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లే. ఇప్పుడు కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ చిత్రంలో సునీల్ ఒక చిలిపి దొంగగా కనిపిస్తాడని సమాచారం..

Shriya Saran has a narrow escape from a Camel attack!

pooja hegde in, rashmika out from vijay’s next!