in

nithin to play 60 years old men role in his next!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు. తను న‌టిస్తున్న రెండు చిత్రాల `రంగ్ దే`,  చెక్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.  ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదిలా వుంటే బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాధున్` రీమేక్ చిత్రం షూటింగ్ ని నితిన్ ఇటీవ‌లే ప్రారంభించాడు. దీనితో పాటు నితిన్ `పవర్ పేట` అనే పీరియడ్ డ్రామాలోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. చాలా కాలంగా రెగ్యుల‌ర్‌ షూటింగ్ వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని ప్రారంభించాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో నితిన్ 60 ఏళ్ల రాజకీయ నాయకుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. స‌రికొత్త కథతో  ఏలూరు స‌మీపంలోని కొల్లేరు నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రంలో స‌రికొత్త గెటప్ లో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా నితిన్ క‌నిపిస్తార‌ట‌. దీనికి సంబంధించిన ఫోటోషూట్ ఇటీవ‌లే పూర్త‌యింది. నితిన్ ఓల్డ్ మాన్ గెటప్ లో మేక‌ప్ టెస్ట్ ని పూర్తి చేశార‌ట

I could not even sleep at night, Samantha reaction to trolls!

Allu Arjun and Vijay Devarakonda multistarrer with ‘Yatra’ director?