in

Allu Arjun and Vijay Devarakonda multistarrer with ‘Yatra’ director?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

బన్నీ, విజయ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్‌ని విజయ్‌ ఆప్యాయంగా బన్నీ అన్న అని పిలుస్తుంటాడు. అలాగే విజయ్‌ని బన్నీ బ్రదర్‌ అని సంభోదిస్తాడు. విజయ్‌కు చెందిన‌ ‘రౌడీ బ్రాండ్’ దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉండే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఇక బన్నీ-రౌడీలు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు

nithin to play 60 years old men role in his next!

finally anil ravipudi gives clarity about 3rd hero in ‘f3’!