
లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయనతార, తన సినిమాల ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు ఆమె హాజరుకావడం చాలా అరుదు. అయితే, తన ఈ నియమాన్ని పక్కనపెట్టి, నిన్న జరిగిన ‘టాక్సిక్‘ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆమె హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను ఎందుకు వచ్చానో కూడా ఈ వేదికపై ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ..
“నేను ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరుకాకూడదని కాదు. నాకు ఆ పని సరిగ్గా చేతకాదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను. కానీ, ఈ కార్యక్రమానికి రావడానికి హీరో యశ్ ఒక్కరే కారణం. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేశారు, ఈ ఈవెంట్‌కు రావడానికి నాకు అది చాలు” అని తెలిపారు. కేవలం యశ్ కోసమే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని స్పష్టం చేశారు. యశ్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెబుతూ..”చాలా మంది పెద్ద స్టార్స్ ఉంటారు. కానీ, యశ్‌ను మొదటిసారి కలిసినప్పుడు, తెరపై ఆయనకున్న లార్జర్-దెన్-లైఫ్ ఇమేజ్ నిజ జీవితంలో కూడా కనిపించింది. ఆయన వ్యక్తిత్వం కూడా అంతే గొప్పది” అని ప్రశంసించారు..!!
