
మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యువ నటి మీనాక్షి చౌదరి ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఒక పాత్ర కోసం చిత్రబృందం మీనాక్షి చౌదరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఇందులో కథానాయికగా కాకుండా..
ఒక కీలకమైన అతిథి పాత్రలో మాత్రమే కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో కథానాయిక ఎవరనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు ఈ చిత్రంలో పూర్తిస్థాయి హీరోయిన్ పాత్ర ఉంటుందా? లేదా? అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు..!!
