in

TRAGIC END OF A LADY COMEDIAN!

వ్వటం ఒక భోగం నవ్వించటం ఒక యోగం అంటారు, కానీ ఎందుకో మరి వెండి తెర మీద ఎందరినో నవ్వించి, కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఎందరో హాస్య నటి,నటులు జీవితాలు విషాదాంతం అవటం ఎంతో బాధాకరం, అలనాటి కస్తూరి శివ రావు తో మొదలు పెట్టి నిన్న మొన్నటి హాస్య నటుల వరకు(అందరు కాకా పోయిన ) ఎక్కువ మంది చివరి దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కోవ కు చెందిన మరొక మొదటి తరం హాస్య నటి కనకం, ఆమె తెర మీదే కాదు సెట్ లో ఉన్న చాల సందడి గ ఉండేదట, ఇంటి నుంచి పిండి వంటలు తెచ్చి అందరి నోరు తీపి చేసేవారట, యెన్.టి.ఆర్. ప్రేమగా కనకం అక్క అని పిలిచే వారట. ఆమె ప్రభ ఎలా వెలిగింది అంటే, ఆమెకు ఇష్టమయిన కూల్ డ్రింక్ మద్రాసులో దొరకక, నెలలో ఇరవై సార్లకి తక్కువ కాకుండా , విమానం లో బెంగుళూరు వెళ్లి కూల్ డ్రింక్ తాగి వచ్చేవారట కనకం. ఎన్నో చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు కనకం, చాలా మంది నటి నటుల లాగే..

ఈమె కూడా చిత్రనిర్మాణం లో అడుగుపెట్టటం అది సజావుగా సాగక పోవటం తో, సంపాదన అంత హారతి కర్పూరం అయిపొయింది, చివరకు ఆస్తులు అమ్మిన కూడా సరిపోక, నాటకాలలో నటించి అప్పులు తీర్చారట కనకం. చిత్ర నిర్మాణం చెప్పట్టారు కాబట్టి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి, చివరకు పూర్తి స్థాయి రంగస్థలానికే అంకితం అయినా జరుగుబాటు కష్టం అయిపోయి, చివరకు స్వస్థలం అయిన విజయవాడ చేరుకొని, అడపా దడపా నాటకాలలో నటిస్తూ చివరి రోజులు అతి కష్టంగ గడిపారట కనకం. ఎందరినో నవ్వించి, చివరకు భుక్తి గడవటం కష్టం గ రోజులు వెళ్లబుచ్చి, కడతేరిపోయారు కనకం. కనకం చనిపోయారని ఎవరు నివాళులు అర్పించలేదు, సంతాప సభలు ఏర్పాటు చేయలేదు, ఆమెను కీర్తించలేదెవరు, ఓ అనామక పేదరాలిగా ఆమె ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. ఎందుకు హాస్య నటుల జీవితాలు ఇలా విషాదాంతం అవుతాయి అనే ప్రశ్నకు సమాధానం దొరకదేమో? ఏమో??

‘balagam’ Kavya Shuts Down Rumors Of Being ‘Body-Shamed’!

27 years for SUBHA SANKALPAM!