సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంటారు సీనియర్ హీరో నాగార్జున. తన తనయుల సినిమాల విషయంలో కూడా పలు రకాల సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తుంటారు. ఏమైనా లోపాలు ఉంటే రీ షూట్స్ చేయించేందుకు కూడా నాగ్ వెనకాడరు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటికే ఇండస్ట్రీలో తన మార్క్ చాటుకోగా.. అఖిల్ మాత్రం సాలిడ్ హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు.
కాగా లాక్డౌన్ నేపథ్యంలో సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తన కుమారుల కొత్త చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేయొద్దని సదరు నిర్మాతలతో నాగ్ మాట్లాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతుండగా.. అఖిల్ హీరోగా అల్లు అరవింద్ ప్రొడక్షన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలను థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని ఆ నిర్మాతలకు నాగార్జున సూచించినట్లు టాలీవుడ్లో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.