in

my focus is only on Tollywood now, says nivetha perthuraj!

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ రెడ్ మూవీలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది.రామ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే అధికారినిగా ఆమె అలరించబోతుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు నివేదా లైన్ లో ఉన్నాయి.అవి కూడా యంగ్ హీరోల సరసన కావడం విశేషం.ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా, స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని ఈ అమ్మడు కలలు కంటుంది.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన రెడ్ సినిమా విశేషాలని, అలాగే తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.రెడ్ సినిమాలో మొదటి సారి విభిన్నమైన పాత్ర చేసే అవకాశం వచ్చిందని, ఇందులో తన పాత్ర రెండు షెద్స్ లో ఉంటుందని తెలిపింది. అలాగే విజయ్ సేతుపతి తరహాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.టాలీవుడ్ పై ఇప్పుడు తన ఫోకస్ ఉందని, ఇక్కడ సక్సెస్ అయ్యాక బాలీవుడ్ మీద దృష్టిపెడతానని చెప్పింది.

Renu Desai in Mahesh Babu’s film!

uppena beauty to romance sudheer babu!