మన మాస్ రాజా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మాతగా అడుగుపెట్టబోతున్నాడట. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సంప్రదింపులు జరపాలని సన్నాహాలు చేస్తుండగా, అల్లు అరవింద్ ఈ ప్రయత్నానికి బ్రేక్ వేసినట్లు సమాచారం. అరవింద్ స్వీయ సంస్థ ‘ఆహా’లో ఓ వెబ్ సిరీస్‌ను వీరిరువురి కలయికలో రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్త నటులను పరిచయం చేయాలని రవితేజ యోచిసున్నట్లు తెలుస్తోంది. దీనికి స్వయంగా రవితేజ దగ్గరుండి అన్ని పనులు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. మరి మాస్ హీరోగా ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఈ విక్రమార్కుడు నిర్మాతగా మారి అందులో సక్సెస్ కిక్‌ను ఎంజాయ్ చేస్తాడా? లేదా? వేచి చూడాల్సిందే..