in

radhika apte asked to do bold scenes without her interest!

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన కొన్ని ప్రతికూల అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని బోల్డ్ పాత్రల్లో నటించిన కారణంగా, కథలో ఆవశ్యకత లేకపోయినా కొందరు దర్శకులు, నిర్మాతలు తనను శృంగార సన్నివేశాల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “కథా గమనంతో సంబంధం లేకపోయినా, కేవలం 15 సెకన్ల పాటు ముద్దు సీన్‌ను చిత్రీకరిద్దాం అని చాలా చులకనగా అడుగుతుంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు నాకు నవ్వొస్తుంది” అని రాధికా పేర్కొన్నారు..

ప్రస్తుతం తాను కథకు అత్యవసరమైతే తప్ప ఇటువంటి సన్నివేశాల్లో నటించడం లేదని, ఆ సన్నివేశం వెనుక ఉన్న సహేతుకమైన కారణాన్ని అడిగి తెలుసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఓ సందర్భంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం చొక్కా గుండీలు విప్పి నటించమన్నారని, ఆ తర్వాత లోదుస్తులతో మాత్రమే చేయాలని కోరారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సన్నివేశం ఉద్దేశాన్ని ప్రశ్నించి, చివరకు అందుకు తాను నిరాకరించానని తెలిపారు. అయితే, తనను అలా కోరిన వ్యక్తి పేరు చెబితే అందరూ ఆశ్చర్యపోతారని, చిత్ర పరిశ్రమలో ఆయనకు విశేషమైన గుర్తింపు, ఉన్నత హోదా ఉన్నాయని ఆమె పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..!!

happy birthday Krithi Shetty!

Katrina Kaif responds about body shaming and online trolls!