in

shruthi haasan impressed pawan and mahesh babu fans!

తాజాగా తను పని చేసిన హీరోలతో పాటు చేయబోయే హీరోల గురించి కూడా మనసులో మాట బయటపెడుతుంది. ఇప్పటికే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితోనూ నటించింది శృతి హాసన్. ప్రభాస్ ఒక్కడే బ్యాలెన్స్ ఉంటే.. ఇప్పుడు ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రశాంత్ నీల్ సినిమా సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే అభిమానులతో ముచ్చటించిన శృతి.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో మాట బయటపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు అంటే పక్కా జెంటిల్ మెన్ అంటూ సమాధానమిచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఎపిక్ (ఇతిహాసం, చరిత్ర) అంటూ సమాధానమిచ్చింది శృతి హాసన్. ఈమె ఇచ్చిన సమాధానాలతో అటు పవన్.. ఇటు మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు..

i am blessed to have this special talent : rashi khanna

can you guess the heroes who rejected these superhit movies!