త్వరలోనే అతడి రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఇలాంటి ఒక వార్తపై మనోజ్ తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవలే రిలీజైన జాతిరత్నాలు సినిమా ట్రైలర్‌లో బ్రహ్మానందం పేల్చిన పంచ్‌ను గుర్తు చేస్తూ.. ఆ స్క్రీన్ షాట్లు పెట్టి డేటు, టైము కూడా మీరే చెప్పేయండి అంటూ ఫన్నీ ఎమోజీలు జోడించాడు మనోజ్. ఈ కామెంట్‌తో అతను తన రెండో పెళ్లి వార్తను ఖండిస్తున్నట్లా లేదా అన్నదిమాత్రం జనాలకు అర్థం కావడం లేదు.
ఐతే మరో పెళ్లి చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని చాటుతూ.. దిల్ రాజు, సునీత లాంటి వాళ్లే ఈ మధ్య కాలంలో రెండో పెళ్లి చేసుకున్నారు. ఏ వయసులో అయినా ఒక తోడు అవసరం అనడంలో మరో మాట లేదు. మంచి ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపించే మనోజ్ కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నారు అతడి సన్నిహితులు, అభిమానులు. మరి ఆ సమయం అప్పుడే వచ్చేసిందా లేక ఇంకా టైం తీసుకుంటాడా అన్నదే చూడాలి.