in

jhanvi kapoor’s tollywood debut confirmed by boni kapoor!

శ్రీదేవి పాపులర్‌ అయిందీ, సూపర్‌స్టార్‌ అయిందీ తెలుగు, తమిళం చిత్రాల ద్వారానే అన్నది బోనీ మనసులో గట్టిగా ముద్ర పడింది. ఆ ముద్రకి అనుగుణంగానే జాన్వీ కూడా తెలుగు, తమిళ చిత్రాల ద్వారానే సక్సెస్‌ అయి, స్టార్‌డమ్‌ని సాధించాలని బోనీ ఆశపడుతున్నారు. క్రియేటివ్‌ జీనియస్‌గా పేరుపడ్డ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో తెలుగులో జాన్వీతో చెయ్యాలనుకుంటున్నట్టు కూడా చిత్రజ్యోతితో జాన్వీ గురించి తన అభిప్రాయాలను, ఫీలింగ్స్‌ని పంచుకున్నారు.

శ్రీదేవిలాగే జాన్వీ కూడా చాలా ఆందమైనదని, బ్యూటిఫుల్‌ ఐస్‌ అని, గ్లాసీ ఫేస్‌ అని..ఇలా రకకాలుగా జాన్వీని అభివర్ణిస్తూ, జాన్వీ కోసమనే ఓ ప్రత్యేకమైన కథ కూడా అనుకున్నట్టు కృష్ణవంశీ చిత్రజ్యోతికి చెప్పారు. బోనీ కపూర్‌ చెప్పినదానిని బట్టి, కృష్ణవంశీ అన్నదానిని బట్టి, వీళ్ళ కాంబినేషన్‌లోనే జాన్వీ మొడటి పిక్చర్‌ ఉండొచ్చన్నది తెలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్‌లో చేసిన చిత్రం రూహీ విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో ఓ పాటకి జాన్వీ చేసిన డాన్స వీడియోను సోనీ మ్యూజిక్‌ సంస్థ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

Jr NTR to host ‘Meelo Evaru Koteeswarudu’ season 5!

manchu manoj responds to second marriage rumors!