చిత్ర పరిశ్రమలో పుకార్లకు కొదువ లేదు. హీరో హీరోయిన్లు కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది తారలు అలాంటి పుకార్లను పట్టించుకోరు.. కానీ మరికొంతమంది తారలు అలాంటి గాసిప్స్ కి స్ట్రాంగ్ రిప్లెలు ఇస్తారు. ఇక తాజగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా అదే పని చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అంతేకాకుండా మొన్న బర్త్ డే జరుపుకున్న వరుణ్, బెంగుళూరు వెళ్లి లావణ్యకు డైమెండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చేశాయి..ఇక ఈ వార్తలపై మెగా హీరో స్పందించలేదు కానీ లావణ్య మాత్రం ఇన్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సంక్రాంతి నుంచి తానూ డెహ్రడూన్ లోని తన సొంత ఇంట్లో ఉన్నానని, కుటుంబ సభ్యులతో ఛిల్ల్ అవుతున్నట్లు ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో నిన్న వరుణ్ బెంగుళూరు వెళ్ళింది లావణ్య కోసమే అనే వార్తలకు చెక్ పడ్డట్లు అయ్యింది.
ఇకపోతే వీరిద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని, అందుకే వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి లావణ్య స్పెషల్ గెస్ట్ గా వెళ్లిందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా లావణ్య క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఇటీవల నాగబాబు, వరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. వరుణ్ కోసం మంచి అమ్మాయిని వెతుకుతున్నాం అని చెప్పడంతో వరుణ్ కి ఏ లవ్ స్టోరీ లేదని తెలుస్తోంది.