in

Krithi Shetty framed the letter written by that star hero!

తాజాగా అలీతో సరదాగా షోకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి వచ్చిన కృతి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది..తాను మొదట యాడ్ షూట్స్ చేస్తూ నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి. తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చిందని .. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతిగా అనిపించిందని..

కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట పంపించారని తెలిపింది. తన చేతితో రాసిన ఓ లెటర్ , గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని… అందులో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాశారని… అందుకే ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నానని తెలిపింది కృతి శెట్టి. పెద్ద స్టార్ హీరో మెచ్చుకొవడం గొప్పగా ఫీల్ అయ్యాయని చెప్పుకొచ్చింది కృతి శెట్టి. అంతేకాకుండా.. తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని.. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ నచ్చిందని.. అవకాశం దొరికితే ఆయనతో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

Love is not real, it is just a chemical reaction: Puri Jagannath

Vishakha Singh Stills at Rowdy Fellow Audio Launch!