in

Kiran abbavaram expressed disappointment about kollywood!

న తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక షాకింగ్ విషయాన్ని పంచుకుంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన గత చిత్రం ‘క’ ను తమిళ్‌లో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని, కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదని ఆయన తెలిపాడు. టాలీవుడ్ సినిమాలు తమిళనాడులో ఎదుర్కొంటున్న వివక్షపై కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. “మన ఇండస్ట్రీలో ఇతర భాషల చిత్రాలను ఎంతగానో ఆదరిస్తాం..

కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఇది కేవలం నా సినిమా గురించే కాదు..ఉదాహరణకు అఖిల్ అన్న నటించిన ‘లెనిన్’ చిత్రం అక్కడ ఒకేసారి విడుదలై ఉంటే ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడేది. మన సినిమాలు కూడా అక్కడ మంచి విజయాన్ని సాధించాలనేదే ఒక తెలుగు సినిమా ప్రేమికుడిగా నా ఆకాంక్ష. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా..థియేటర్లు ఇచ్చినా తమిళ్ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడరని నిష్కర్షగా చెప్పారు. ఆ సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసింది” అంటూ కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు..!!

lenin!

WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!