in

Beauty Satvika Veeravalli flooded with Telugu Movie offers!

beauty Satvika Veeravalli flooded with telugu movie offers!

సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం రావడమే కష్టమంటే.. వచ్చిన మొదటి అవకాశంతోనే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇదే విషయంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది యంగ్ హీరోయిన్ సాత్విక వీరవల్లి. ఇంకా ఆమె నటించిన మొదటి సినిమా థియేటర్లలో విడుదల కాకముందే అక్కినేని హీరో నాగచైతన్య సరసన నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. సాత్విక వీరవల్లి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సాత్విక గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సినిమా ఎడిటింగ్ సమయంలో ఆమె నటనను చూసి తాను ఎంతగానో ఆకట్టుకున్నానని, కొత్త అమ్మాయి అయినప్పటికీ మంచి అనుభవం ఉన్న నటిలా అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. దీంతో తన నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే తదుపరి సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న సినిమాలో సాత్వికను కథానాయికగా ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు దర్శకుడు క్లాక్స్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన గతంలో 'బెదురులంక 2012' చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక సాత్విక వ్యక్తిగత నేపథ్యం కూడా ఆసక్తికరమే. అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేసిన ఆమె సినిమాలపై ఉన్న ఆసక్తితో తన కెరీర్‌ను వదిలి నటన వైపు అడుగులు వేశారు. మరోవైపు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆర్సీ 17' సినిమాలోనూ ఆమె పేరు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి మొదటి సినిమా విడుదల రోజే నాగచైతన్య వంటి స్టార్ హీరోతో మరో అవకాశం అందుకోవడం సాత్వికకు మంచి ఆరంభమనే చెప్పాలి. సాత్వికకు చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉంది. అమెరికాలో పెరిగిన ఆమె భరతనాట్యం నేర్చుకోవడంతో పాటు సినిమాలను కూడా ఎక్కువగా చూసేవారు. ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన తర్వాత తనకు నచ్చిన నటన వైపు అడుగులు వేశారు. కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం..!!

Arjun Sarja files complaint against reports targeting his daughter!

Arjun Sarja files complaint against reports targeting his daughter!