in

Keerthy Suresh to act with small hero Suhas!

సుహాస్ కు జోడిగా కీర్తి సురేష్ నటించబోవడం ఖచ్చితంగా విశేషమే. మొన్నటిదాకా నాని, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఆడిపాడిన మహానటికి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కాలే కానీ వెంటనే ఒప్పేసుకునే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉప్పు కప్పురంబు చేస్తోంది. ఇది థియేటర్ మూవీ కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటిటి కోసం నిర్మించిన సినిమా.

అనిల్ ఐవి శశి దర్శకత్వంలో రాధికా లావు నిర్మాతగా ప్రొడక్షన్ జరుగుతోంది. ఇవాళ జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో అఫీషియల్ గా ప్రకటించారు..సుహాస్ హాజరైనా డేట్ల సమస్య వల్ల కీర్తి సురేష్ రాలేదు..ఒకరకంగా సుహాస్ కి ఇది ప్రమోషన్ లాంటిది. పేరున్న హీరోయిన్లతో యాక్ట్ చేయడం ఖచ్చితంగా ఇమేజ్ ని పెంచుతుంది. పైగా వైవిధమైన కాన్సెప్ట్స్, టైటిల్స్ తో ఆకట్టుకుంటున్న సుహాస్ ఈ రెండేళ్లలో సుమారు ఏడెనిమిది రిలీజులతో పలకరించబోతున్నాడు..!!

ram charan keeping hollywood on hold?

Actress Surabhi Nearly Escaped Death in a flight incident!