in

Actress Surabhi Nearly Escaped Death in a flight incident!

బీరువా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాల్లో అలరించిన తెలుగు హీరోయిన్ సురభి.. తాను త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటేనే చాలా భయంకరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇదివరకెప్పుడూ ఎదురుకాని ఒక ఘటన ఆదివారం ఎదురైందని, తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

విమానం పైలెట్ నియంత్రణలో లేకుండా పోయిందని, ఆ సమయంలో బాగా భయం వేసిందని ఆమె చెప్పారు. అయితే పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా అంతా ప్రాణాలతో బయటపడ్డామని ఆమె వెల్లడించారు. చావు అంచుల దాకా వెళ్లొచ్చాననే భావన కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందని అన్నారు..!!

Keerthy Suresh to act with small hero Suhas!

Kareena Kapoor finally confirms her South debut!