in

ram charan keeping hollywood on hold?

ప్రజంట్  సెన్షేనల్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. నెక్స్ట్ బుచ్చి బాబు సానా తో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పానిండియా సినిమాలే. ఈ గ్లోబల్ స్టార్ కి హాలీవుడ్ లో కూడా ఆఫర్స్  వస్తున్నాయని, హాలీవుడ్ మేకర్స్ చెర్రీని సంప్రదిస్తున్నారని టాక్. కానీ వీటికి చెర్రీ ఓకే చెప్పటం లేదంట. హోల్డ్ లో పెడుతున్నాడని తెలుస్తోంది.

అదేంటి నిన్న కాక మొన్న వచ్చిన స్టార్స్ కూడా పానిండియా, పాన్ వరల్డ్, హాలీవుడ్ అంటూ అర్రులు చాస్తుంటే, చెర్రీ మాత్రం హాలీవుడ్ ఆఫ్ర్స్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారట. కానీ చెర్రీ ఆలోచన వేరు అవకాశం వచ్చింది కదా అని వచ్చిన ప్రతి సినిమాని  ఒప్పుకోకుండా, ముందు ఇంట గెలిచి తరవాత రచ్చ  గెలవాలని అనుకుంటున్నాడని సమాచారం..!!

Anupama Opens Up About choosing Bold Role In Tillu Square!

Keerthy Suresh to act with small hero Suhas!