in

Jr NTR and Rishab Shetty to team up for Kantara: Chapter 1

‘కాంతారా’లో జూనియర్ ఎన్టీఆర్
ఇ
టీవ‌ల ఎన్టీఆర్ కుటుంబ స‌మేతంగా క‌ర్ణాట‌క‌లోని కొన్ని దేవాల‌యాల‌ను సంద‌ర్శించుకొన్నాడు. ఆ స‌మ‌యంలో రిష‌బ్ ఎన్టీఆర్ తో పాటే ఉన్నాడు. ఎన్టీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ‘కాంతార 2‘లో మీరు న‌టిస్తురా’ అనే ప్ర‌శ్న తార‌క్‌కు ఎదురైంది. ”అదంతా రిష‌బ్ శెట్టి చేతుల్లో ఉంది. ఆయ‌న ప్లాన్ చేస్తే నేను న‌టించ‌డానికి సిద్ధ‌మే” అని ప‌చ్చ‌జెండా మ‌న‌సులో మాట చెప్పేశాడు తార‌క్.

‘కాంతార’ ప్రీక్వెల్‌లో యాక్టింగ్‌ చేస్తున్నారా: ఎన్టీఆర్‌ సమాధానమిదే
ప్రీక్వెల్ కు కొత్త ఎన‌ర్జీ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్ కోసం ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర రిష‌బ్ శెట్టి రాసుకొన్నా ఆశ్చ‌ర్చ‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. కాంతార ఫ్రైంచైజీకి అది అవ‌స‌రం కూడా. పాన్ ఇండియా సినిమా సంస్కృతి బాగా పెరిగిపోయింది. హీరోలంతా మిగిలిన భాష‌ల్లో న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్టీఆర్ – రిష‌బ్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. కాబ‌ట్టి. ఎన్టీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని రిష‌బ్ వ‌దులుకోడ‌నే అనిపిస్తోంది. చూద్దాం. ఏం జ‌రుగుతుందో?  రిష‌బ్, ఎన్టీఆర్‌లు క‌లిస్తే మాత్రం కాంతార‌ ప్రీక్వెల్ ఓ రేంజ్‌లో త‌యార‌వ్వ‌డం ఖాయం.!!

actress Nivetha Thomas on Justice Hema Committee!

Allu Arjun’s Pushpa 2 OTT Rights Sold For A huge Price!