in

Rajinikanth To Be A Part Of Rishab Shetty’s Kantara 2?

చిన్న చిత్రంగా విడుదలై.. పాన్‌ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకొని సత్తా చాటింది ‘కాంతార’. రూ.15కోట్లతో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కాంతార2’ పట్టాలెక్కనుంది. అయితే తాజాగా ఈ మూవీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ బ్లాక్‌బాస్టర్‌ సినిమా ప్రీక్వెల్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్‌ శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా..ఆయన మౌనంగా వెళ్లిపోయారట. దీంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. ఇది రూమర్‌ అయితే రిషబ్‌ స్పందించే వాడని.. ఏమీ చెప్పలేదంటే ‘కాంతార2’ లో రజనీ కనిపించడం ఖాయమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది..!!

Renu Desai reveals suffering from heart and health issues!

Taraka Ratna Maintains NTR’s Connection With kids by names!