ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించి మెప్పించాడు. గత ఏడాది ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది జాన్వీ కపూర్.
ఈ అమ్మడు విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కింది జాన్వీ. ఆమె చేతికి గాయం అయి.. కట్టుతో కనిపించింది. దీంతో ఆమె చేతికి గాయం ఎలా అయ్యిందని.. ఎందుకు అంతపెద్ద కట్టు ధరించాల్సి వచ్చిందని అక్కడే విలేకర్లు ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీంతో జాన్వీ కపూర్ ప్రవర్తనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన సరైనది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇంత గర్వం ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.గతంలోనూ తన ప్రవర్తనతో అనేకసార్లు ట్రోల్స్ జరిగాయి. ఇటీవల జాన్వీ కపూర్ తన సొదరి, స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తూ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫోటోలకు ఫోజులివ్వమని ఫోటోగ్రాఫర్లు అడగ్గా.. పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుంది. జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కలమావు కోయిల’కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ తరచూ వాయిదా పడుతోంది.