in

regina, nivetha keeps all their hopes on ‘Saakini Daakini’!

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..

రీసెంట్ గా రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.

మిస్ గ్రానీ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ఓ బేబీగా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిడ్ నైట్ రన్నర్స్ కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఇక చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రెజీనా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తిరిగి తెలుగులో రాణించాలని చూస్తుంది ఈ అమ్మడు. అలాగే నివేద కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది.

Rashmika interesting comments about samantha’s item song!

Reshma Pasupuleti in pink transparent saree!