in

anchor ravi files Complain to cybercrime police!

బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ యాంకర్ రవి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవాడిని కాదని..

కానీ తన కుటుంబసభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా స్టార్ మాటీవీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి బయటకు రావడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలీడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది.

Jhanvi Kapoor gets slammed about her hand injury!

‘nela ticket’ girl malvika-sharma new cute stills!