in

ram charan and sujeeth collaboration might happen?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకరైన దర్శకుడు సుకుమార్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ లైనప్ లో నెక్స్ట్ దర్శకులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా లిస్ట్ లో లేదు. కానీ లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ ఇపుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. యంగ్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు సుజీత్ తో రామ్ చరణ్ సినిమా ఉండొచ్చు అనే టాక్ ఇప్పుడు మొదలైంది.

సాహో, ఓజి ఇప్పుడు బ్లడీ రోమియో అంటూ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సుజీత్ వర్క్ అండ్ తన సినిమాల క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలా ఒక్క సాలిడ్ సబ్జెక్టు రామ్ చరణ్ తో పడితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది. కానీ ఈ మ్యాడ్ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా ఉంటే సుజీత్ బ్లడీ రోమియో, ఓజి 2 తర్వాతే ఉంటుంది అనుకోవాలి..!!

Kajal Aggarwal opens up on rising divorces and marital issues!