in

Janhvi Kapoor charging a bomb for Tollywood Films

ఎట్ట‌కేల‌కు శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ తెలుగు తెర‌పై అడుగు పెట్ట‌బోతోంది. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్ పేరు దాదాపుగా ఖాయం అయిన‌ట్టే. అయితే ఈ చిత్రంలో జాన్వీని తీసుకురావ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా విష‌యాల్లో రాజీ ప‌డిన‌ట్టు స‌మాచారం. జాన్వీ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింద‌ని, తాను అడిగింది ఇవ్వ‌డానికి నిర్మాత కూడా రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. అంతే కాదు… సినిమా సెట్స్ పైకి వెళ్ల‌క ముందే పూర్తి స్థాయి స్క్రిప్టు త‌న చేతిలో ఉండాల‌ని, స్క్రిప్టు ఇచ్చిన త‌ర‌వాత‌…

అందులో అక్ష‌రం కూడా మార్చ‌డానికి వీల్లేద‌ని కండీష‌న్లు పెట్టింద‌ట‌..ద‌క్షిణాదిన క‌థానాయిక‌లు ఈ స్థాయిలో డిమాండ్లు చేయ‌డం, ష‌ర‌తులు విధించ‌డం చాలా అరుదైన విష‌యం. స‌మంత‌, అనుష్క లాంటి క‌థానాయిక‌లు సైతం.. ఇలాంటి కండీష‌న్లు పెట్ట‌రు. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌కుండానే ఇలా చుక్క‌లు చూపిస్తోందంటే, ఇక ఒక‌ట్రెండు హిట్లు ప‌డితే ఏం చేస్తుందో? ఏరి కోరి మ‌రీ.. జాన్వి వెంట ప‌డ‌డం, సినిమా చేయ‌మంటూ బ‌తిమాల‌డ‌డంతో.. త‌ను చెట్టెక్కి కూర్చున్న‌ట్టుంది ప‌రిస్థితి. జాన్వీ రావ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్టుకు ఎంత ప్ల‌స్సో తెలీదు కానీ.. ప్ర‌స్తుతానికైతే..జాన్వీ కండీష‌న్ల‌కు త‌లొంచాల్సి వ‌స్తోంది..!!

TOP 10 STAR HEROINES OF TOLLYWOOD WHO DANCED FOR ITEM SONGS!

sensational Sree Leela bags two Biggies in Tollywood?