in

Prabhas opens up on dating Kriti Sanon rumors on Unstoppable!

ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ అనే సినిమాలో నటించారు తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తోంది. ఎలా మొదలయిందో ఎందుకు మొదలయిందో తెలియదు కానీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నిజం కాదని ఇప్పటికే కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది కానీ ప్రభాస్ ఇప్పటివరకు ఇలాంటి విషయాల మీద మాట్లాడలేదు. గతంలో అనుష్కతో పెళ్లి అంటూ జరిగినప్పుడు కూడా ఆయన పెద్దగా స్పందించింద లేదు..

గాని ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ కృతి సనన్ తో డేటింగ్ గురించి ప్రశ్నించగా అసలు ఈ ప్రచారంలో పుకార్లలో ఎలాంటి నిజం లేదని మా మధ్య మంచి స్నేహం తప్ప అంతకుమించిన రిలేషన్ ఏదీ లేదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రతి సనన్ క్లారిటీ ఇచ్చిందని కూడా ప్రభాస్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉందని జరుగుతూ వచ్చిన ప్రచారానికి బ్రేకులు పడినట్లు అయింది..!!

recovered samantha gives good news to her fans!

top gear!