in

ismart Nidhi Agarwal is on board for Prabhas’s next?

సెప్టెంబర్ 28న సలార్, నెక్స్ట్ సమ్మర్‌లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఆ మధ్య లీక్ అయిన ఆన్ సెట్స్ ఫోటోలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ప్రభాస్‌తో మారుతి మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది.

మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ తో పాటు, రాధే శ్యామ్‌లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న రిద్ది కుమార్ ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు..కానీ థర్డ్ బ్యూటీ ఎవరనేదే క్లారిటీ లేకుండా పోయింది. ముందు నుంచి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ..ఇప్పటి వరకు ఎలాంటి హింట్ లేదు. అయితే మొన్న ఆగష్టు 17న నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా..నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అమ్మడికి స్పెషల్‌గా బర్త్ డే విష్ చేసింది. దీంతో ప్రభాస్ సినిమాలో నిధి కూడా నటిస్తుందనే క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పాలి..!!

happy birthday raadhika!

busy bee Sreeleela Rejects 10 Crore Offer For having Bold Content?