in

Sharwanand joins nani to take part in Rajinikanth’s next?

ప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం “జైలర్” చిత్రం వరల్డ్ వైడ్ భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతూ ఉండగా యూఎస్ లో కూడా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకుంది. దీనితో ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ హీరోగా చేయనున్న సినిమాలు పై మరిన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో దర్శకుడు టి జి జ్ఞ్యానవేల ముత్తు అయితే చేయనున్న ఓ భారీ మల్టీ స్టారర్ కూడా ఒకటి..

కాగా ఈ చిత్రంలో అయితే అమితాబ్ బచ్చన్ నాని లాంటి వారు ఉండగా ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే ఈ పాత్రపై ఓ క్రేజీ టాక్ ఇప్పుడు సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ అయితే రజినీకి ఆపోజిట్ గా విలన్ పాత్రలో నటిస్తున్నట్టుగా అంటున్నారు. మరి ఇదైతే అసలు ఊహించనిది అని చెప్పాలి. రజినీ ఏంటి రజినీకి విలన్ గా ఈ కుర్ర హీరో ఏంటి..ఇది మాత్రం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. మరి అసలు తాను ఈ చిత్రంలో ఎలా కనిపిస్తాడా అనేది చూడాలి. కాగా ఈ చిత్రం అయితే ఈ రెండు నెలల్లో స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది..!!

Regina Opens Up About Her Casting Couch Experience!

Mr Pregnant!