in

how did venkatesh missed Romancing Miss World aishwarya rai

తెలుగులో ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా నటించని ఐశ్వర్యారాయ్ కి తెలుగులో సినీ అభిమానుల్లో కూడా ఆమెకి ఎంతోమంది ఫాన్స్ ఉండడం నిజంగా ఒక అద్భుతం. తెలుగులో కేవలం నాగార్జున సినిమా ‘చందమామ రావే లో’ కేవలం ఒక పాటలో నాగార్జునతో ఒక మెరుపు మెరిసింది. అంతేగాని సంపూర్ణంగా ఏ సినిమాకి కూడా ఆమె హీరోయిన్గా మన తెలుగు స్టార్ సరసన నటించలేదు. అయితే అప్పట్లో ఐశ్వర్యారాయ్ ని తెలుగులో ఒక హీరో సరసన నటించేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి అంట. ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. జయంత్ సి. పరాజి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, అంజన జావేరి హీరోయిన్గా, సురేష్ బాబు ప్రొడక్షన్లో ప్రేమించుకుందాం రా అనే సినిమా వచ్చింది. అసలు మొదట ఈ సినిమాకి హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ని పెట్టాలని దర్శకుడు అనుకున్నాడు అంట.

ఈ విషయాన్ని వెంకటేష్ తో చర్చించగా..వెంకటేష్ కూడా ఐశ్వర్యరాయ్ తో కలిసి నటించేందుకు ఉర్రూతలు ఉగాడంట. కానీ అప్పటికే రెండు సినిమాలు ఫ్లాప్స్ ఐశ్వర్యారాయ్ ఖాతాలో వేసుకుందట. అందుకని ఈ సినిమా ప్రొడ్యూసర్ సురేష్ బాబు సెంటిమెంటల్ గా ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో పెడితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి అవకాశం ఉందని అందుకని ఐశ్వర్య రాయిని హీరోయిన్గా వద్దని సురేష్ బాబు చెప్పాడంట. అయితే అప్పట్లో ఐశ్వర్యారాయ్ మీద అంత క్రేజ్ ఉండటం వలన.. ఐశ్వర్యారాయ్ అయితేనే బాగుంటుందని వెంకటేష్ చాలా అనుకున్నాడు అంట గాని..సురేష్ బాబు ఒప్పుకోకపోవడంతో..వాళ్ళిద్దరూ కలిసి నటించడం అవ్వలేదంట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అంజన జవేరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ప్రేమించుకుందాం రా అంటూ నటించిన ఈ సినిమాలో వీళ్ళిద్దరూ రొమాంటిక్ సీన్స్ అన్నీ కూడా ఎంతో బాగా పండించారు..!!

Mohan Babu faces murder allegations for Soundarya’s death!

Aamir Khan confirms dating Gauri Spratt!