in

Rukmini Vasanth Breaks Silence on Viral Fake Bikini Photos!

కొన్ని రోజులుగా, గ్రీన్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి వెళుతున్నట్లుగా ఉన్న ఓ మహిళ ఫొటోలు, వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఇది రుక్మిణి వసంత్ ‘మొదటి బికినీ షూట్’ అంటూ ప్రచారం చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రుక్మిణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దీనిపై పూర్తి వివరణ ఇచ్చారు. “నా పేరుతో సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఏఐ-జనరేటెడ్ చిత్రాలు నా బృందం దృష్టికి వచ్చాయి..

ఆ చిత్రాలు పూర్తిగా ఫేక్, కల్పితం అని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించి, వ్యాప్తి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని, ఇది వ్యక్తిగత గోప్యతా హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫేక్ చిత్రాలను రూపొందించి, వ్యాప్తి చేసిన వారిపై తన బృందం సైబర్ క్రైమ్, చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తుందని రుక్మిణి తెలిపారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించవద్దని, ఆ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు..!!

how did venkatesh missed Romancing Miss World aishwarya rai