in

hero Vishwak Sen shocked by fan Suicide threats!

మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో నిత్యం ట‌చ్ చేస్తున్నారు. ఖాళీ దొరికితే సెష‌న్స్ ఏర్పాటు చేసి వాటిలో వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తున్నారు. తాజాగా పాగ‌ల్ హీరో విశ్వ‌క్ సేన్ అభిమానుల‌తో చాట్ చేశాడు. ఇందులో కొంద‌రు ప్రేమ‌గా మాట్లాడితే, మరి కొంద‌రు బెదిరింపుల‌కు దిగారు. అయితే చాట్‌లో భాగంగా పాగ‌ల్ హీరో త‌న‌కు ఇలియానా ఫ‌స్ట్ క్ర‌ష్ అని, ఆమె కోసం నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక నెంబ‌ర్ ఇవ్వ‌మ‌ని అడిగితే, త‌ప్ప‌క ఇస్తాను..

ఇంతకీ ష‌ర్ట్ ఆర్ ప్యాంట్, ఏది గిఫ్ట్ గా ఇవ్వ‌బోతున్నావు అంటూ కొంటెగా స‌మాధానం ఇచ్చాడు..మ‌రో నెటిజ‌న్ నా మ‌న‌సులో ఉంటున్నందుకు 10 వేల రూపాయ‌లు పంపించు అని అడిగాడు. ఇదిలా ఉంటే ఓ వ్య‌క్తి .. ‘అన్నా నువ్వు రిప్లై ఇవ్వ‌క‌పోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు’ అని కామెంట్ చే‌శాడు. దీంతో ఖంగు తిన్న విశ్వ‌క్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. మీ గుండెల్లో ఎప్పుడు ఉంటా అని అతనిని శాంతింప‌జేశాడు. ప్ర‌స్తుతం ఓ మై క‌డ‌వులే రీమేక్‌లో న‌టిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైంద‌ని స్ప‌ష్టం చేశాడు విశ్వ‌క్ సేన్.‌

indhira Gandhi garu rasina letter nu frame chesi pettukunna vivek!

super star Salman Khan praises stylish star Allu Arjun!