in

brahmanandam to play buildup babai role in ‘pelli sandhadi’!

త కొంత కాలంగా సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్న బ్రహ్మీ మరో సారి ఆడియన్స్ ను తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోబోతున్నాడట. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో బ్రహ్మీ అనుబంధం ఇప్పటిది కాదు. వీరిద్దరి కలయికలోనూ ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా శ్రీకాంత్ నటవారసుడు రోషన్ తో రాఘవేంద్రుడు తీస్తున్న `పెళ్లి సందడి`లో బ్రహ్మానందం నటిస్తున్నారట. ఇందులో బిల్డప్ బాబాయ్ అనే ఓ వెరైటీ రోల్ లో హాస్యం పండించబోతున్నాడట.

నిజానికి ఇది జబర్ దస్త్ లో గెటప్ శ్రీను వేసిన బిల్డప్ బాబాయ్ పాత్ర స్ఫూర్తిగా రూపొందిందట. `నమ్మరేంట్రా బాబూ` అంటూ ఓ విధమైన మేనరిజంతో గెటప్ శ్రీను ఆకట్టుకున్నారు. ఇప్పుడు బ్రహ్మీ అదే తరహా పాత్రలో కనిపిస్తాడట. ఇటీవల ‘జాతిరత్నాలు’లో జడ్జి పాత్రతో మెరుపులు మెరిపించారు బ్రహ్మానందం. ఇప్పుడు ఈ ‘పెళ్ళిసందడి’ లోనూ రాఘవేంద్రరావు కోరిక మేరకు నటిస్తున్నారట. మరి బిల్డప్ బాబాయ్ గా బ్రహ్మీ ఎలా నవ్విస్తాడో చూడాలి..

Rakul Preet drives a truck, calls it ‘once in a lifetime experience’!

indhira Gandhi garu rasina letter nu frame chesi pettukunna vivek!