in

harish shankar to direct chiranjeevi and salman khan?

మెగా ఫామిలీ అంటే హరీష్ శంకర్ కి ప్రత్యేక అభిమానం. ఇప్పటికే మెగా హీరోలు అందరితో సినిమాలు తీసిన, హరీష్ ఇప్పుడు  మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయటానికి రెడీ అయ్యాడు. భోళాశంకర్ మూవీ ఫ్లాప్ తరవాత చిరు సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ఇలాంటి టైం లో హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా కథ వేరే లెవెల్ లో ఉండి ఉంటుందని టాక్.

హరీష్ తన రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్  ఖాన్ తో చేయనున్నాడని సమాచారం. చిరుతో చేయబోయే సినిమాకి డైరెక్టర్, రచయిత బివిఎస్ రవి కథ అందిస్తున్నాడు. చిరు కూతురు సుస్మిత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి హరీష్ ఇన్నాళ్ళకి లైన్లో పడ్డాడని, ఫాన్స్ ఆనందంగా ఉన్నారు..!!

Hrithik Roshan to lock horns with Mahesh Babu?

Premalu Mamitha Baiju Flooded With Offers From Tollywood!