in

Premalu Mamitha Baiju Flooded With Offers From Tollywood!

మిత బైజు..ఇప్పుడు కుర్రాళ్లంతా జపిస్తున్న పేరు..తపిస్తున్న పేరు. రీసెంటుగా విడుదలైన ‘ప్రేమలు’ ఆమెకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ముందే ఈ బ్యూటీ 15 సినిమాల వరకూ చేసింది. కానీ ఆమెను స్టార్ ను చేసింది మాత్రమే ఈ సినిమానే. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘రీను’ పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

మమిత ఈ సినిమాలో తన చలాకి నటనతో కుర్రాళ్ల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కుర్రాళ్లు హారతులు పడుతుండటం ఆశ్చర్యం. మమిత క్రేజ్ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటంతో, టాలీవుడ్ నుంచి ఆమెకి వరుస ఆఫర్లు వెళుతున్నాయని వినికిడి. త్వరలోనే తెలుగు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించే అవకాశం లేకపోలేదు..!!

harish shankar to direct chiranjeevi and salman khan?

Anupama Opens Up About choosing Bold Role In Tillu Square!