in

dusky beauty Pooja Hegde reduces her remuneration!

రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య వంటి వరుస పరాజయాల తర్వాత పూజాకు ఆశించిన స్థాయిలో విజయాలను వరించలేవని చెప్పాలి. దీంతో ప్రస్తుతం మళ్లీ కమ్‌ బ్యాక్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తోందీ చిన్నది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం గమనార్హం. తమిళంలో రెండు చిత్రాలు హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. వీటిలో తమిళ అగ్ర హీరో దళపతి విజయ్‌ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పడం ఖాయమని పూజా భావిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా పూజా రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలో భారీగా రెమ్యునరేషన్‌ తీసుకున్న ఈ చిన్నది తాజాగా రెమ్యునరేషన్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. అవకాశాలు తగ్గడంతోనే పూజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్‌ సినిమాకు పూజా రెమ్యునరేషన్‌ తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. ఈ సినిమా కూడా తనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావంతో ఉంది..!!

anushka shetty completes her to new films!

Mahesh Babu-Rajamouli Film To Be In Two Parts?