in

anushka shetty completes her to new films!

నిశ్శబ్దం మూవీతో తర్వాత చాలారోజులు గ్యాప్‌ తీసుకొని మిస్సెస్‌ పొలిశెట్టి..మిస్టర్‌ శెట్టి సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ జేజమ్మ సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలోనే తొలిసారిగా మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కథనార్‌ మూవీలో నటిస్తున్నది. చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి రాబోతున్నది. దాంతో పాటు క్రిష్‌ జాగర్లముడి దర్శకత్వంలోనూ బైలింగ్యువల్‌ చిత్రంలోనూ నటించింది.

ఈ మూవీ షూటింగ్‌ సైతం పూర్తయ్యిందని.. త్వరలోనే విడుదలకానున్నట్లు టాక్‌..ఒకేసారి అనుష్క బైక్‌ బ్యాక్‌ మూవీలతో అభిమానులను పలుకరించబోతున్నది. ఆయా సినిమాల ప్రమోషన్స్‌ త్వరలో మొదలుకానుండగా..స్వీటీ సైతం పాల్గొని పలుకరించబోతుందట. చాలారోజులు విరామం అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అనుష్క లుక్‌పై పెద్ద చర్చ జరుగుతున్నది. గతంలో ఓ మూవీ కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు..!!

happy birthday prabhas!

dusky beauty Pooja Hegde reduces her remuneration!