కేవలం డాన్సులతో శ్రీలీల ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టం. ఎందుకంటే విజయశాంతి భానుప్రియ జమానా నుంచి రమ్యకృష్ణ మీనాల తర్వాత రష్మిక మందన్న వరకు ప్రతి ఒక్కరి కెరీర్లో పెర్ఫార్మన్స్ కు దోహద పడిన పాత్రలు పడ్డాయి కాబట్టే గ్రాఫ్ పరంగా గొప్పగా చెప్పుకునే సందర్భాలు వచ్చాయి. కానీ శ్రీలీలకు అలాంటి బ్రేక్ ఇంకా దక్కలేదు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టరైన దాని ఫలితంలో సింహభాగం బాలకృష్ణకే చెందుతుంది. కనక శ్రీలీలకు దక్కిన షేర్ తక్కువే. అయినా సరే కెరీర్ బెస్ట్ లో ఈ సినిమానే నెంబర్ వన్ లో ఉంటుందని తనే చెప్పింది.
గత ఏడాది మూడు డిజాస్టర్లు పడ్డాయి. గుంటూరు కారం ఫైనల్ స్టేటస్ ఇంకో వారంలో తేలిపోతుంది. ఇకపై వచ్చే కథల విషయంలో అమ్మడు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఉత్తి డాన్సుల కోసమే అయితే క్రమంగా ప్రేక్షకులకు బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, స్కందలో జరిగిన పొరపాటు ఇదే. ధమాకాలో క్లిక్ అయ్యాయని చెప్పి పదే పదే ఎక్కువ డాన్సులు ఉండేలా చేయడం హీరోలకు సైతం ఇబ్బందులు తెచ్చి పెడుతోంది..!!