సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఈశ్వరన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ పదే పదే మధ్యలో కలుగజేసుకుంటూ ‘శింబు మామ ఐ లవ్యు’ అని చెప్పు అంటూ అడ్డుపడుతూ బలవంత పెట్టారు. దీంతో నిధి కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ.. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి ‘మామా ఐ లవ్యూ’ అని చెప్పే డైలాగ్ ఉంటుందని, దాన్ని హైలైట్ చేద్దామనే ఆడియో ఫంక్షన్లో అలా చెప్పనని వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది.