శ్రీలీల..ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సెన్సేషన్..కేవలం రెండే సినిమాలు..’పెళ్లి సందడి’, ‘ధమాకా’, ఈ రెండు పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు కాకున్నా..ఈ అమ్మడు జీవితాన్ని పూర్తి గ మార్చేసింది..శ్రీలీల నటన..డాన్స్..క్యూట్ లుక్స్..యూత్ ను బాగా ఫిదా చేసింది. ప్రస్తుతం ఏ హీరోయిన్ కు కూడా లేనన్ని ఆఫర్స్ ఈ ధమాకా పిల్ల చేతిలో ఉన్నాయి..అదృష్టమంటే తనదే కదా..ఓవర్ మేకప్ లేకుండా మన పక్కింటి పిల్లల ఉండటం కూడా తనకు బాగా కలిసి వచ్చే విషయం..సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అంతా తమ సినిమాలో శ్రీలీలనే కావాలంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దాదాపు 10 సినిమాల్లో నటిస్తోంది. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనూ శ్రీలీలే..అలాగే నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో బాలయ్యకు కూతురిగా శ్రీలీల నటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో సైతం ఛాన్స్ కొట్టేసింది. ఇవే కాకుండా ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది..ఇక తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో గురించి చెప్పమంటే బాలయ్య గురించి చెప్పడం విశేషం. తాను చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య బాబుకి వీరాభిమానినని.. కొద్ది రోజుల క్రితం నుంచే ఆయనతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న మంచి పనులు, సేవా కార్యక్రమాలు చూసి బాలయ్య ను మరింతగా ఆరాధించడం మొదలు పెట్టానని శ్రీలీల చెప్పుకొచ్చింది. అమ్మడి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య అభిమానులైతే శ్రీలీల మాటలు విని పొంగిపోతున్నారు.