in

Ts Minister Malla Reddy turns down Pawan Kalyan’s film offer!

వన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించేందుకు తనకు ఆఫర్ వచ్చిందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పబ్లిక్ స్టేజి మీద చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇది తేరి రీమేక్. మెయిన్ స్టోరీని అలాగే ఉంచేసి గబ్బర్ సింగ్ తరహాలో ఒరిజినల్ కన్నా ఇదే బెటరనిపించేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ప్రస్తుతం క్యాస్టింగ్ చేసే పనుల్లో బిజీగా ఉన్న హరీష్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం మల్లారెడ్డిని గంటన్నర బ్రతిమాలుకున్నారట.

కానీ నో అనేశారు..మన మినిస్టర్ మల్లన్న..’తేరి’ లో ఈ క్యారెక్టర్ ప్రముఖ దర్శకులు నటులు మహేంద్రన్ పోషించారు. పరమ దుర్మార్గుడిగా వయసు మళ్ళిన వ్యక్తిగా గొప్పగా పండించారు. ఆయన పెర్ఫార్మన్స్ కు అవార్డులు కూడా వచ్చాయి. సమంతాని ఫ్లాష్ బ్యాక్ లో దారుణంగా చంపించేది ఈయనే. పోలికల పరంగా చూసుకుంటే మల్లారెడ్డి మంచి ఛాయసే కానీ అసలు నటనే రాని మనిషితో అంత పవర్ ఫుల్ రోల్ చేయించాలని హరీష్ ఎలా అనుకున్నారో ఏమో. ఛాయ్ బిస్కెట్ టీమ్ నిర్మించిన మేం ఫేమస్ టీజర్ లాంచ్ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం మల్లారెడ్డి ఈ హాట్ న్యూస్ చెప్పేశారు.!!

HAPPY BIRTHDAY RAM CHARAN!

dhamaka girl sreeleela reveals about her favorite hero!